ఈజీ మనీ కోసం అలవాటు పడిన స్కామర్లు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నిలువునా దోచేస్తున్నారు. సైబర్ నేరాలపై 2023లో 'సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు దేశవ్యాప్తంగా 11,28,265 ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సైబర్ ముఠాల ఎత్తుల్ని చిత్తు చేసేందుకు కేంద్రహోంశాఖ సైబర్ కమాండోలను రంగంలోకి దించబోతోంది.