

రాజారాంపల్లిలో వాసవికన్యకా పరమేశ్వరి జయంతి వేడుక
ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఆర్యవైశ్యుల కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా బుధవారం శ్రీ మాత చిత్ర పటానికి పూలమాలలు వేసిన స్థానిక ఆర్యవైశ్య సంఘం నేతలు. గ్రామ జగిత్యాల మూల మలుపు వద్ద ప్రయాణికులకు చల్లని శుద్ద జలం, పండ్లు , ఫలాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల రమేష్ గుప్త, ఆర్య వైశ్య సంఘం నేతలు, వ్యాపారులు పాల్గొన్నారు.