పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలో అక్రమంగా గత ప్రభుత్వ మద్యం షాపుల్లో కొనుగోలు చేసిన పాత మద్యం విక్రయిస్తున్న బేతా దుర్గా ఫణేంద్ర బాబు అనే వ్యక్తి వద్ద 21 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కట్టా శారద సతీష్ తెలిపారు. గ్రామంలో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో సిబ్బందితో దాడి చేసి నిందితుడి వద్ద మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.