అఖిల భారత పశుగణన సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని, భారతదేశం అంతటా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పశుగణన నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమ పోస్టర్ ను శుక్రవారం ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 2, 2025 వరకు జరుగుతోందన్నారు.