పారిశుద్ధ్యం, తాగునీటి పైపుల నిర్వహణపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఆదేశించారు. ఎలమంచిలిలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రధాన రహదారులపై బహిర్భూమికి ఎవరు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.