విశాఖ నగరంలో జీవీఎంసీ కి సంబంధించి జీవీఎంసీ గుత్తేదారులు చేపట్టిన అభివృద్ధి పనులలో నాణ్యతను తప్పకుండా పాటించి సకాలంలో పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ ఐఎఎస్ పేర్కొన్నారు. శనివారం ఆయన జీవిఎంసి సమావేశం మందిరంలో ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారులతో కలసి సమీక్ష నిర్వహించారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.