సోమవారం గొలగొండపేటలో నిర్వహించిన పల్లెపండగ కార్యక్రమంలో, నాతవరం గ్రామానికి చెందిన పైల వెంకటరమణ ఆరోగ్యంగా బాగోలేక పోవడంతో, సీఎం రిలీఫ్ ఫండ్ కింద 98,117 రూపాయలను అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, ఇటీవలకాలంలో ఇలాంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించటం జరుగుతుందని తెలిపారు.