విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్త్ సబ్ డివిజన్ ఏసిపిగా ఎస్. అప్పలరాజును ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా 47 మంది డీఎస్పీలకు జరిగిన బదిలీల్లో భాగంగా వెయిటింగ్లో ఉన్న అప్పలరాజును విశాఖ ఉత్తర సబ్ డివిజన్‌కు ప్రభుత్వం కేటాయించింది. గతంలో ఆయన విశాఖలో వివిధ పోలీస్ స్టేషన్లలో సీఐగా విధులు నిర్వహించారు. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.