తుఫాను కారణంగా ఈ నెల 23 నుంచి 25 వరకు జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ జిల్లా, మండల అధికారులను ఆదేశించారు. అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. వర్ష ప్రభావాన్ని బట్టి పాఠశాలలకు సెలవులను ప్రకటించాలని అన్నారు.