పార్వతీపురం: దీపం పథకం క్రింద డిబిటి ద్వారా రూ. 164 కోట్లు
దీపం పథకం క్రింద జిల్లాలో డిబిటి ద్వారా రూ. 164 కోట్లు బదిలీ కానుందని మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో దీపం-2 పథకం క్రింద 1, 97, 727 మందిని అర్హులుగా గుర్తించడం జరిగిందని అన్నారు. దీపం పథకంలో భాగంగా ఉచిత సిలిండర్లు పంపిణీ కార్యక్రమం శుక్రవారం పార్వతీపురం పట్టణంలో పాత బస్టాండ్ వద్ద స్థానిక ఎమ్మెల్యే చంద్రతో కలసి పాల్గొన్నారు.