పార్వతీపురం మండలంలో గత 15 రోజులుగా తిష్ట వేసిన ఏనుగుల గుంపు గురువారం పెద్దబొండపల్లి, గదవవలస గ్రామాల మధ్యనున్న తోటల్లో సంచరించింది. పెదబొండపల్లికి చెందిన దేవాబత్తుల యాకోబు (74) గురువారం సాయంత్రం ఏనుగులను వీక్షించడానికి గ్రామస్తులతో కలిసి వెళ్లాడు. యాకోబు స్వతహాగా చెవిటివాడు కావడంతో ఏనుగుల అలికిడి వినిపించుకోలేక పోయాడు. అంతవరకు శాంతంగా ఉన్న ఏనుగుల గుంపు హఠాత్తుగా వృద్ధుడిపై దాడి చేశాయి.