నెల్లిమర్ల: డయేరియాపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

50பார்த்தது
నెల్లిమర్ల: డయేరియాపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
నెల్లిమర్ల మండలం కొండగుంపాం జడ్పీ హైస్కూల్ లో హెచ్ఎం వేణుగోపాలరావు ఆధ్వర్యంలో పిహెచ్ సి వైద్య బృందం విద్యార్థులకు డయేరియా పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. వ్యాధి లక్షణాలు, వాటి నివారణ మార్గాలను వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కాచి వడబోసిన నీటిని త్రాగాలని సూచించారు. త్రాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని తెలిపారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி