వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలోని ప్రధాన ప్రాజెక్టులైన అరణీయార్, కాళంగి రిజర్వాయర్లు నిండి వరద నీటిని గేట్ల ద్వారా వదిలారు. అన్ని మండలాల అధికారులు తమ పరిధిలోని నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.