కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన ఉభయ దారుల సమావేశం రచ్చ రచ్చగా మారింది. సెప్టెంబర్ నెల 7వ తేదీ నుంచి 27 వరకు 21 రోజుల పాటు జరగనున్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై ఆలయ ఉభయదారులతో ఆలయ ఈవో వెంకటేష్, అధికారులు సమావేశమయ్యారు. కాణిపాకం ఆలయంలో అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఉభయ దారులు ఎదురు తిరిగారు. దీంతో రచ్చ రచ్చగా మారింది.