నెల్లూరు జిల్లాలో పెన్నా బ్యారేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు చిడి బాయి (64) శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. స్టౌబీడీ కాలనీకి చెందిన లక్ష్మణ్ సింగ్ దంపతులు బైక్‌పై ప్రయాణిస్తున్నప్పుడు అదుపుతప్పి చిడి బాయి కిందపడి తలకు తీవ్ర గాయమైంది. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.