చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన హేమాద్రి పింఛన్ తొలగించడం వివాదాస్పదమైంది. 'నాకు చిన్నతనం నుంచి వైకల్యం ఉంది. రూ 75 పింఛన్ ఇస్తున్నప్పటి నుంచి నాకు పెన్షన్ వచ్చేది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ వ్యక్తి తనపై కక్షతో పింఛన్ తొలగించేలా చేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళనకు దిగాడు.