పెద్ద గొట్టిపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం..
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడు గ్రామంలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అంటించారు. అనంతరం మాట్లాడుతూ 100 రోజుల పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుల కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు పనిచేస్తున్నాడని తెలిపారు. అనంతరం గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.