చిలమత్తూరు సమీపంలో జరిగిన అత్యాచార ఘటనలో ఆరుగురిలో ఇదివరకే ఐదుగురిని అరెస్టు చేయడం జరిగిందని అప్పటినుండి పరారీలో ఉన్న చాకలి శ్రీనివాసులను రెండవ నిందితున్ని కూడా అరెస్ట్ చేసినట్లు బుధవారం సత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న వెల్లడించారు. కర్ణాటక నుండి ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబం చిలమత్తూరు సమీపంలో పేపర్ మిల్లులో వాచ్మెన్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న వారిపై ఇలా చేయడం దుర్మార్గమన్నారు.