సైదాపురం మండలం పెరుమాళ్లపాడు, ఊటుకూరు, జోగిపల్లి, పొక్కందల, దాడిశెట్టిపల్లి, మొలకలపూండ్ల, రామసాగరం, తూర్పుపూండ్ల గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులచే ఫూలే టీచర్స్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా వారు జీఓ 117 రద్దు చేయాలని, ప్రతీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా కనీసం ఇద్దరు ఎస్జీటీ ఉపాధ్యాయులను నియమించాలని, ఉపాధ్యాయులకు పదోన్నతులు నిర్వహించాలని, ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టాలని, హై స్కూల్స్ నందు అన్ని తరగతుల్లో తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాలను సమాంతరంగా నిర్వహించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని, తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అమలయ్యేలా చూడాలని తద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.