ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొండాపురం మండలం బీసీ కాలనీలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో సర్పంచుల ఖాతాలో డబ్బులు లేకపోవడం వలన కనీసం పంచాయతీల పరిధిలో ఎటువంటి పనులు చేయలేకపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదనే జాగ్రత్తతో కూటమి ప్రభుత్వం పంచాయతీలలో నిధులు జమచేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఉదయగిరిని అభివృద్ధి చేస్తామని తెలిపారు.