నెల్లూరు: విద్యుత్ చార్జీలపై మాట తప్పిన చంద్రబాబు: కాకాణి
ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలను ఐదేళ్లు పెంచబోమని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే మాట తప్పి విద్యుత్ చార్జీలను పెంచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంకటాచలం మండలంలో పోరు బాటలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలపై 15 వేల కోట్ల విద్యుత్ బారాలను మోపారని విమర్శించారు.