నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెద్ద చెరుకూరు గ్రామానికి చెందిన నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి, నెల్లూరు మురళి రెడ్డిలతో పాటు వారి అనుచరులు పెద్ద సంఖ్యలో సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి లు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.