ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నెల్లూరు నగరంలోని గోమతినగర్ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకులని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన రంజకమైన పాలన సాగిస్తున్న పవన్ కళ్యాణ్, జనసేన పార్టీకి తమ పూర్తి మద్దతు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం వారు పలు సమస్యలను చర్చించారు.