నెల్లూరు నగరంలో రెచ్చిపోతున్న ఆకతాయిలు
నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో శుక్రవారం రాత్రి ముగ్గురు ఆకతాయిలు రెచ్చిపోయారు. హారన్ కొట్టొద్దు అన్నందుకు ఓ నూడిల్స్ దుకాణ యువకుడి పై ముగ్గురు యువకులు మూకుమ్మడి దాడి చేశారు. మద్యం మత్తులో ఉండి బైక్ లో త్రిబుల్ రైడింగ్ చేస్తూ భారీగా హారన్ మోగిస్తూ ఉండడంతో నూడిల్స్ దుకాణ యజమానులు ప్రశ్నించడంతో అతనిపై దాడి చేసారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.