నెల్లూరు: 'పిల్లల భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు' ఆత్మీయ సమావేశం
పిల్లల భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు ఆత్మీయ సమావేశం శనివారం నెల్లూరు రూరల్ పరిధిలోని కేఎన్ఆర్ హైస్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల పాఠశాలల్లో ఒకేరోజు ఒకే సమయంలో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు చెప్పారు.