తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే డాటా ఎంట్రీ ప్రక్రియ వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ముమ్మరంగా కొనసాగుతుంది. స్థానిక ఎంపీడీవో వెంకన్ గౌడ్ పగలు, రాత్రి సర్వే డాటా ఎంట్రీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మహేశ్ కుమార్ తదితరులు ఉన్నారు.