నెల్లూరు నగరంలోని దర్గా మెట్టలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం కార్తీక మాసం సందర్భంగా చివరి రోజు ఆకాశదీప ఉద్వాసన, పోలీ స్వర్గపూజ కార్యక్రమంను ఆదివారం రాత్రి దీపాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ శాసనసభ్యులు సతీమణి సుజిత, ఆలయ పూజారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.