ఫెంగల్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి: సీఎం

79பார்த்தது
ఫెంగల్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి: సీఎం
ఏపీలో ఫెంగల్ తుఫాను ప్రభావం, ప్రభుత్వ సహాయక చర్యలపై అధికారులతో సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. సుమారు 6,824 హెక్టార్ల మేర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని.. అందుకు అవసరమైన ఎన్యుమరేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. వర్షం కారణంగా తడిచిన ధాన్యం ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని సీఎం సూచించారు.

தொடர்புடைய செய்தி