నెల్లూరు రూరల్ గొల్ల కందుకూరు గ్రామంలో ఈనెల 29న ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ గొల్ల కందుకూరు, సజ్జాపురం గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహిస్తున్నామన్నారు.