సోమవారం నెల్లూరు ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అన్నం శ్రీనివాసులు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్ రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియ నిలిపివేయాలని ఒక ప్రకటనలో తెలిపారు. సర్దుబాటు ప్రక్రియలో భాగంగా బలవంత బదిలీలకు రంగం సిద్ధం చేస్తోంది. దీని వల్ల విద్యా బోధనకు ఆటంకం కలగడమేగా, విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమయ్యే పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి అన్నారు.