వెంకటాచలం మండలంలో పూడిపర్తి, నిడిగుంట పాలెం, గుడ్లూరు వారి పాలెం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులచే ఫూలే టీచర్స్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మక్తాల నరేంద్ర, జి. వి. రత్నం, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, సురేష్, రాష్ర్ట ఆర్థిక కార్యదర్శి తుమ్మా రవి, జిల్లా నాయకులు అద్వానపు రవి బాబు పాల్గొన్నారు.