లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు వరుసగా మూడవరోజు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ తో కలిసి వెళ్లారు. కుడి కాలువ గేటు మరమ్మత్తు కోసం జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కి నిపుణుల బృందం జరుగుతున్న పనితీరును వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో గేటు మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని నిపుణుల బృందానికి ఎమ్మెల్యే కోరారు.