ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కేజ్రీవాల్‌కు పోటీగా మాజీ ఎంపీ పర్వేశ్ వర్మ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు 29 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. మాజిందర్ సింగ్ సిర్సా-రాజౌరి గార్డెన్, కైలాశ్ గెహ్లాత్-బిజ్వాసన్, అర్వీందర్ సింగ్ లవ్లీ-గాంధీనగర్, దుష్యంత్ గౌతమ్-కరోల్ బాగ్ నుంచి పోటీ చేస్తున్నట్లు పేర్కొంది.