AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైడ్రామా నెలకొంది. తాడిపత్రి జనసేన ఇన్‌ఛార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డిని శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి.. కొద్దిసేపటికే విడుదల చేశారు. దాంతో పోలీస్ స్టేషన్ నుంచి ఆయన ఇంటికి వెళ్లిపోయారు. కాగా, నిన్న పోలీసులపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు చేశారు. పోలీసులు దొంగలతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. దాంతో పోలీసులు శ్రీకాంత్ రెడ్డి విమర్శలపై వివరణ ఇవ్వాలని అడిగినట్లు సమాచారం.