చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం నినాదంతో వాసవి క్లబ్ లెజెండ్స్ ప్రజాసేవకు వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం కందుకూరు పట్టణం కోవూరు రోడ్డులోని స్వర్ణ స్వయంకృషి మానసిక దివ్యాంగుల ఆశ్రయానికి కందుకూరు స్టూడెంట్స్ బ్యాగ్స్ వారి సహకారంతో చీదెళ్ల ప్రసాద్ తండ్రి చీదెళ్ల లక్ష్మయ్య జ్ఞాపకార్థం రెండు సిమెంటు బెంచ్లను మంగళవారం చీదేళ్ల లక్ష్మీనరసింహ తారక బహుకరించారు.