కలువాయి మండలం దాచూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు నృత్య ప్రదర్శనతో అలరించారు. మంగళవారం పాఠశాల హెడ్ మాస్టర్ కె. శ్రీనివాసులు రెడ్డి పదవి విరమణ మహోత్సవంలో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన చేశారు. పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శన అగ్ర భాగాన నిలుస్తుందని పలువురు కొనియాడారు. కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు హెడ్ మాస్టర్ ను సత్కరించి విద్యార్థులను అభినందించారు.