గత మూడు వారాలుగా రైతులను, ఇరిగేషన్ నిపుణులను ముప్పు తిప్పలు పెట్టిన రాళ్లపాడు షట్టర్ సమస్యకు ఎట్టకేలకు తెరపడింది. షట్టర్ ను పూర్తిగా తొలగించారు. మంగళవారం మధ్యాహ్నం 200 క్యూసెక్కులకు పైగా నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేశారు. దీంతో రాళ్లపాడు ఆయకట్టు రైతుల మోముల్లో ఆనందం విరిసింది. రాళ్లపాడు షట్టర్ సమస్య పూర్తిగా తీరేంతవరకు, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దృష్టిని సారించారని రైతులు చెబుతున్నారు.