ఒంగోలు నగరంలో శనివారం గంట సమయం పాటు భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో ఒంగోలు నగరమంతా జలమయం అయింది. కర్నూలు రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు రహదారి మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. రహదారిపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.