విశాఖపట్నం జిల్లా పెందుర్తి లోనే శ్రీ శారదా పీఠానికి గత వైసిపి ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిన భూములను నూతనంగా ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయటాన్ని సాదరంగా స్వాగతిస్తున్నామని ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నార్నే వెంకటసుబ్బయ్య తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం వారు మాట్లాడుతూ స్వామీజీలు అప్పనంగా ప్రభుత్వ భూములను దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.