కందుకూరు: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం కందుకూరు శాసనసభ్యులు *ఇంటూరి నాగేశ్వరరావు* సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న అభాగ్యుల జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతున్నాయని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. పేదల పాలిట వరములా సీఎం సహాయ నిధి నిలిచిందన్నారు.