కందుకూరు పట్టణం డివి నగర్ లో తెలుగుదేశం పార్టీ నాయకుడు మురకొండ రామారావు ఆదివారం మృతి చెందారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మురకొండ రామారావు ఇంటి వద్దకు వెళ్లి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.