కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా భోగి పండుగను నిర్వహించారు. సోమవారం ఉదయం 5 గంటలకు పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద భోగిమంటలు వేసి నియోజకవర్గ ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నె రోశయ్య మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.