కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విద్యావేతన పథకం (PMSS) అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా భారత సైనికులు, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ లో పనిచేసిన మాజీ సైనికుల పిల్లలకు ఉన్నత సాంకేతిక, ప్రొఫెషనల్ విద్యను ప్రోత్సహిస్తోంది. ఈ స్కాలర్ షిప్ పథకంలో భాగంగా బాలురకు ప్రతి నెల రూ.2,500, బాలికలకు రూ.3,000 అందిస్తోంది. 10+2, డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో కనీసం 60% మార్కులు కలిగి ఉన్న వారు KSB వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.