కందుకూరులోని పలుకూరు గ్రామంలో నార్నె బాలయ్య మెమోరియల్ అల్ ఇండియా టూ సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.