కందుకూరు మున్సిపాలిటీ వెంకటాద్రిపాలెంలో జాతీయ రహదారి పనులకు మట్టిని తరలిస్తున్న టిప్పర్ల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని, వాటిని రిపేరు చెయ్యాలని శనివారం రైతులు ఆందోళనకు దిగారు. మాలకొండ నుంచి సింగరాయకొండ వరకు 167బి జాతీయ రహదారి నిర్మాణం పనులకు వెంకటాద్రిపాలెం పొలాల నుంచి మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. భారీ వాహనాలు వెళ్లడంతో పొలాలకు వెళ్లే మట్టి రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని అన్నారు.