కేరళలోని పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి స్వరూపుడై అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మకర జ్యోతిని ప్రత్యక్షంగా 1.5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల నమ్మకం. జ్యోతి దర్శనంకు ముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను మూలమూర్తికి అలంకరించి హారతిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ మకర జ్యోతి దర్శనమిచ్చింది.