కందుకూరు మండలం పలుకూరు గ్రామంలో నార్నే బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు, ఆలిండియా సీనియర్ బాల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ ను సోమవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ, శాసనమండలి విప్ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు, ఓటమిని సమానంగా స్వీకరించి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. ఓడిపోతే నిలుస్తాహం వద్దన్నారు.