రైతులకు అవసరమైన ఎరువుల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ, మార్క్ఫెడ్, ఏపీఎంఐపి శాఖల అధికారులతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్ కు సంబంధించిన వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువులను చూడాలని తెలిపారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు.