ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ మద్యం దరఖాస్తుదారులు సోమవారం ఒంగోలుకు చేరుకున్నారు. ఒంగోలులోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ భవన్ లో మద్యం లాటరీ ప్రక్రియ సాగుతున్న నేపథ్యంలో జిల్లాలో దరఖాస్తు సమర్పించిన దరఖాస్తుదారులు భారీగా అక్కడికి తరలివచ్చారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ ఆ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా లాటరీ కార్యక్రమానికి చేరుకున్నారు.