ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో రహదారులకు మహర్దశ పట్టినట్లుగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. సిఎస్ పురం మండలంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ. రెండు కోట్ల నిధులతో నిర్మించే 13 అంతర్గత సిమెంట్ రహదారులకు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఐదేళ్ల పరిపాలన కాలంలో గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు.